స్తన్యపానము-వేటూరి ప్రభాకర శాస్త్రి

స్తన్యపానము-వేటూరి ప్రభాకర శాస్త్రి

Friday, December 28, 2012

8:02 PM

తల్లి పసికందుకు చన్నుగుడిపే దృశ్యానికి మించిన సౌందర్యవంతమైన

సన్నివేశం సృష్టిమొత్తంలో ఎక్కడా కానరాదు.విశ్వవ్యాప్తంగా ఈ సహజ

సౌందర్య ఆకర్షణకి లొంగిపోని కళాకారుడు లేడు.దేశకాలలకతీతంగా తల్లీబిడ్డల

ఈ స్తన్యానుబంధాన్నిచిత్రించిన కవులూ, కళాకారులు ఎందరో!

యనభై ఏళ్ళ కిందటే మన తెలుగులో ప్రముఖ కవి కీ॥శే॥ వేటూరి ప్రభాకర

శాస్త్రి గారు తన ‘కడుపుతీపి’ కావ్యంలో స్తన్యపాన ప్రాముఖ్యాన్నిఅత్యంత ప్రతిభా

వంతంగా చెప్పుకొచ్చారు.నా కంటబడిన ఆ పాతబంగారాన్ని మీ కళ్ళెదటా

పెట్టాలని ఇలాః

చిత్తగించండి!

ఉ॥ గొబ్బున వచ్చి యొక్కసను గుడ్చుచు నీడ్చుచుఱైక మాఱుచే

బ్రబ్బి మఱొక్క సన్ దడవి పట్టుచు రెండును బాలవంకలై

యుబ్బి స్రవింపగా జననియుం దలమూర్కొన బొట్టనిండగా

జుబ్బన జూఱ లాడెడు నిసుంగు గనుగొన వేడుకయ్యెడున్.

మ॥కుచసంపన్నత  కూలిపోవు ననియో క్రొవ్వారు మైసౌరు విం

తచమత్కారము లంతరించుననియో, స్తన్యంబు లేకుండ గు

బ్బచనుల్ దిబ్బలుగా నొనర్చుకొని డబ్బాపాలచే నిప్డు పు

త్త్ర చయంబుం బరిమార్చు మాతలటె మాతల్!కాలదూతల్ గదా!

(కడుపు తీపి)

ఆంధ్రవైద్యసమ్మేళనపత్రిక- దశమవార్షికసంచిక1931-పుట114

రెండు చురకలు …!!

రెండు చురకలు …!!

via రెండు చురకలు …!!.

Categories: Uncategorized

నా లోకం

నా లోకం

via నా లోకం.

Categories: Uncategorized